నారా లోకేష్‌కు గుడివాడ అమర్నాథ్ రిటర్న్ గిఫ్ట్..!

by Sathputhe Rajesh |   ( Updated:2024-02-20 14:29:16.0  )
నారా లోకేష్‌కు గుడివాడ అమర్నాథ్ రిటర్న్ గిఫ్ట్..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో పాలిటిక్స్ హీటెక్కాయి. నాయకుల మధ్య మాటల యుద్ధం పీక్స్ కు చేరింది. అయితే శంఖారావం పేరిట ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న నారా లోకేష్ అనకాపల్లి సభలో మాట్లాడుతూ.. గుడ్డు పాలసీతో అంతర్జాతీయంగా ఏపీ పరువు తీసిన అమర్నాథ్‌కు గుడ్డు గిఫ్ట్‌గా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇక నారా లోకేష్‌కు మంత్రి అమర్నాథ్ సైతం మంగళవారం అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. మీడియాతో మాట్లాడుతూ.. పప్పు లోకేష్‌కు పప్పును కానుకగా పంపుతున్నానన్నారు. కొంచెం ఉప్పు కారం కూడా వేశానని తెలిపారు. లోకేష్‌లా తాను బ్యాక్ డోర్ పొలిటీషయన్ కాదన్నారు. పాలిటిక్స్‌లో 18 ఏళ్లు కష్టపడి జగన్ ఆశీస్సులతో మంత్రి అయ్యానన్నారు. లోకేష్, చంద్రబాబు కుర్చీలను తాము ఎప్పుడో మడత పెట్టేశామన్నారు. లోకేష్‌కు అనకాపల్లి అభివృద్ధి కనిపించలేదా అని ప్రశ్నించారు. 420 గాళ్లను పక్కనబెట్టుకుని వారిలానే లోకేష్ మాట్లాడారని ఫైర్ అయ్యారు.

Read More..

వంగి కొబ్బరికాయ కొట్టలేనోడివి నువ్వా యువకుడివి..? జగన్‌పై లోకేష్ ఫైర్

Advertisement

Next Story