- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
విశాఖ రైల్వే జోన్ కు గ్రీన్ సిగ్నల్
దిశ, వెబ్ డెస్క్ : పండగపూట ఏపీకి శుభవార్త అందించింది కేంద్ర ప్రభుత్వం. ఎన్నో ఏళ్ల విశాఖపట్నం వాసుల కల విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు రైల్వే శాఖ ముందుకు వచ్చింది. ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఓ ప్రకటన జారీ చేశారు. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అన్ని రకాల చర్చలు పూర్తయ్యాయని, త్వరలోనే రైల్వే జోన్ ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్ చేస్తామని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో స్థల సేకరణ విషయంలో ఉన్న ఇబ్బందులను ప్రస్తుత ఏపీ కూటమి ప్రభుత్వం సరి చేసిందని, ఇక రైల్వే జోన్ ఏర్పాటుకు ఎలాంటి అడ్డంకులు లేవని మంత్రి అన్నారు. కాగా దశాబ్దాల కాలం నుండి రైల్వే జోన్ ఏర్పాటుకు ఎన్నో వినతులు చేసినప్పటికీ.. అది ఇప్పటికీ నెరవేరబోతోందని అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు విశాఖ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Read more...
ఏపీ పూర్తి స్థాయి బడ్జెట్‌పై సన్నాహాలు.. ఆర్థిక శాఖ కీలక ఆదేశాలు