- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఏపీ రైతుల అకౌంట్లలోకి రూ.13,500
దిశ, వెబ్ డెస్క్: ఏపీ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. 2023-24 సీజన్ వైఎస్సార్ రైతు భరోసా మూడో విడత నిధులను ఈ 28న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. పెట్టుబడి సాయంతో పాటు సున్నా వడ్డీ రాయితీ సొమ్మును రైతుల ఖాతాల్లోకి జమ చేయనుంది. రైతు భరోసాతో పాటు సున్నావడ్డీ రాయితీ కింద 64 లక్షల 37 వేల మంది రైతుల కుటుంబాలకు మొత్తం రూ. 1,294.34 కోట్లను అందించనుంది. పెట్టుబడి సాయం కింద 53 లక్షల 58 వేల మంది రైతులకు ఒక్కొక్కరికి రూ.2 వేల చొప్పున మొత్తం రూ.1,078.36 కోట్లను వారి ఖాతాల్లోకి జమ చేయనుంది.
అలాగే 10 లక్షల 79 వేల మందికి ఇవ్వాల్సిన 2021-22 రబీ సీజన్, 2022 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి సున్నా వడ్డీ రాయితీ కింద రూ.215.98 కోట్ల సాయాన్ని ఈ నెల 28న అందించనున్నారు. పీఎం కిసాన్, రైతు బరోసా పథకం కింద కేంద్రం ఇచ్చే రూ.6 వేలతో కలిపి ప్రతి ఏటా ప్రభుత్వం రూ.13,500ను రైతుల అకౌంట్లలో జమ చేస్తోంది. ఈ ఏడాది రైతు భరోసా మూడో విడత కింద సీఎం జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు.
Read More..
Breaking: టీడీపీకి భారీ షాక్.... కీలక నేతలంతా మూకుమ్మడి రాజీనామా