- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
AP News : చేనేత కార్మికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్

దిశ, వెబ్ డెస్క్ : చేనేత కార్మికులకు(Handloom Workers) ఏపీ ప్రభుత్వం(AP Govt) భారీ గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రంలోని వేలమంది చేనేత కార్మికులపై వరాల జల్లు కురిపించారు. నేతన్నలకు ఉచిత విద్యుత్(Free Electricity) అందివ్వనున్నట్టు సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) ప్రకటించారు. చేనేత కార్మికుల ఇళ్లకు 200 యూనిట్ల వరకు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తామని తెలిపారు. దీనివల్ల ఏపీలోని 93 వేల మంది చేనేతకారుల గృహాలకు.. 10, 534 మరమగ్గాల ఓనర్స్ కు లబ్ది చేకూరుతుందని వెల్లడించారు. అదే విధంగా చేనేత కార్మికుల కోసం మరో ముఖ్య నిర్ణయం ప్రకటించారు చంద్రబాబు.
చేనేత కార్మికుల ఇంటి నిర్మాణానికి రూ.50,000 వేల ఆర్థిక సాయం చేస్తామని వెల్లడించారు. అంతేకాకుండా నేతన్నలకు జీఎస్టీ రీయింబర్స్మెంట్ అమలు చేస్తామని పేర్కొన్నారు. నేత కార్మికులను వృద్ధిలోకి తీసుకు రావడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు తెలియజేశారు. ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహాకాలను వినియోగించుకొని చేనేత కార్మికులు ఆర్థిక వృద్ధి సాధించాలని కోరారు. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన ఈ నిర్ణయాలపై నేత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.