బాబాయ్ YS వివేకా హత్య కుట్రలో CM జగన్ పాత్ర: గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2024-03-02 07:30:45.0  )
బాబాయ్ YS వివేకా హత్య కుట్రలో CM జగన్ పాత్ర: గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం జగన్‌పై టీడీపీ సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిలో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాబాయ్ వైఎస్ వివేకా హత్య కుట్రలో సీఎం జగన్ పాత్ర ఉందని.. అందుకే కేసు విచారణలో అటంకం కలిగిస్తు్న్నాడని ఆరోపించారు. రాష్ట్రంలో వైసీపీ అవినీతి, అక్రమాలకు అంతులేకుండా పోయిందని మండిపడ్డారు. రాజమండ్రి కేంద్రంగా ఇసుక మాఫియా నడుపుతున్నారని, ఎన్జీటీ ఆదేశాలను సైతం కూడా లెక్క చేయడం లేదని అన్నారు.

ఇష్టారీతిన ఇసుక తవ్వకాలు చేయడంతో రాజమండ్రిలో బ్రిడ్జ్‌లు, బ్యారేజీలు ప్రమాదంలో పడ్డాయని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇసుక తవ్వకాలతో బ్యారేజీకి ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ అధికార యంత్రాంగంతో రాజకీయ ప్రచారం చేయిస్తున్నారని ఫైర్ అయ్యారు. వాలంటీర్ వ్యవస్థను జగన్ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read More..

మంగళగిరి సీటు గెలిపించి CM జగన్‌కు గిఫ్ట్ ఇస్తా: ఎమ్మెల్యే ఆర్కే కీలక వ్యాఖ్యలు

Advertisement

Next Story