- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గుడ్‌న్యూస్.. టీచర్ల బదిలీల డేట్ ఫిక్స్..!!
దిశ, వెబ్‌డెస్క్: ఉపాధ్యాయ బదిలీల, పదోన్నతులకు సంబంధించిన షెడ్యూన్‌ను రెండు రోజుల్లో విడుదల చేపడతామని విద్యాశాఖ కార్యదర్శి బుర్ర వెంకటేశం తెలిపారు. జూన్ 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు బదిలీల, పదోన్నతుల ప్రక్రియను చేపడతామని పేర్కొన్నారు. ఈ పదోన్నతుల ద్వారా దాదాపుగా 5,563 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు లభించనున్నాయన్నారు. 11,062 ఉపాధ్యాయ పోస్టులు.. డీఎస్సీ ద్వారా అదనంగా 11,062 ఉపాధ్యాయ పోస్టులు అందుబాటులోకి వస్తున్నాయని వెల్లడించారు. ఇక గతంలో అన్నింటినీ కలిపి హేతుబద్ధీకరణ చేపడతామని తద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత కూడా లేకుండా చేస్తామని బుర్రా వెంకటేశం తెలిపిన విషయం తెలిసిందే. అలాగే ప్రైవేటు పాఠశాలల్లో రుసుముల నియంత్రణకు మూడు, నాలుగు నెలల్లో కొత్త చట్టం తెచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని వెల్లడించారు.