Good News: నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో భారీగా పోలీసు శాఖలో ఉద్యోగాల భర్తీ!

by Shiva |
Good News: నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో భారీగా పోలీసు శాఖలో ఉద్యోగాల భర్తీ!
X

దిశ, వెబ్‌‌డెస్క్: గంజాయి రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తయారు చేసేందుకు కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోబోతోంది. ఈ క్రమంలో సర్కార్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. త్వరలోనే పోలీస్ శాఖలో భారీ ఎత్తున కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేపట్టబోతున్నట్లు డీజీపీ ద్వారకా తిరుమల రావు వెల్లడించారు. ఇవాళ రాయలసీమ జిల్లాల ఎస్పీలతో ఆయన సమీక్ష నిర్విహించారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులను అడ్డుకట్ట వేసేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా యువతను చిదిమేస్తున్న గంజాయిని సమూలంగా నిర్మూలించేందుకు ఫోకస్ పెట్టాలని ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed