ఏపీలో నిరుద్యోగులకు, వృద్ధులకు గుడ్ న్యూస్

by srinivas |   ( Updated:2024-03-29 13:05:46.0  )
ఏపీలో నిరుద్యోగులకు, వృద్ధులకు గుడ్ న్యూస్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో నిరుద్యోగులకు, వృద్ధులకు టీడీపీ అధినేత చంద్రబాబు గుడ్ న్యూస్ తెలిపారు. తాము అధికారంలోకి వస్తే ప్రభుత్వ శాఖలల్లోని అన్ని ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. వృద్ధులకు రూ. 4 వేలు పింఛన్ అందిస్తామన్నారు. అంతేకాదు కొందరు ఊరి వెళ్లినా సరే 3 నెలల పింఛన్ ఒకేసారి ఇంటికే తెచ్చి ఇస్తామని చెప్పారు. కావలి ప్రజాగళంలో చంద్రబాబు ప్రసంగించారు.


ఇక బీసీలకు ప్రత్యేక చట్టం ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రత్యేక కార్యక్రమంతో యానాదులను ఆదుకుంటామని చెప్పారు. ప్రజల ఆదాయం పెంచుతామని, ఖర్చులు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. ఎన్డీఏలో ఉన్నా మైనార్టీల హక్కుల కాపాడతామని చంద్రబాబు తెలిపారు. వాలంటీర్లపైనా చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వస్తే మంచి వాలంటీర్లను మాత్రమే కొనసాగిస్తామని చెప్పారు. వాలంటీర్లు వైసీపీకి అనుకూలంగా పని చేయొద్దని చంద్రబాబు హెచ్చరించారు.

Read More..

జనసేనా పార్టీలో చేరనున్న అనసూయ..! క్లారిటీ ఇచ్చిన యాంకరమ్మ

Advertisement

Next Story