- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శ్రీవారి భక్తులకు శుభవార్త..తిరుమల ప్రయాణం ఈ తేదీల్లో ప్లాన్ చేసుకోండి
దిశ వెబ్ డెస్క్: కలియుగ దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామికి కోట్లల్లో భక్తులు ఉంటారు. ఏడుకొండల పైన వెలసిన ఆ శ్రీనివాసుడిని చూడడానికి వ్యయప్రయాసలకు ఓర్చి తిరుమలకు చేరుకుంటారు. కాగా నిత్యం లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలి వెళ్తుండడంతో రైళ్లలో రద్దీ పెరిగింది. కొందరు భక్తులకు టిక్కెట్లు కూడా దొరకని పరిస్థితి. ఈ నేపథ్యంలో శ్రీవారి భక్తుల రద్దీని టిక్కెట్లు దొరకక భక్తులు పడే ఇబంధులను దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకున్న దక్షిణ మధ్య రైల్వే తిరుపతికి నాలుగు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. కాగా ఈ ప్రత్యేక రైళ్లు ఈ నెల 25వ తేదీ నుండి 28వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి.
ఇక ఈ రైళ్ల వివరాలు చూస్తే సికింద్రాబాద్ నుండి తిరుపతి వెళ్లే రైలు (07041) 25 వ తేదీ సికింద్రాబాద్ నుంచి రాత్రి 8 గంటలకు బయలుదేరి 26 వ తేదీ ఉదయం 9 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఆ తరువాత ఇదే రైలు 26 వ తేదీ రాత్రి 07:50 గంటలకు తిరుపతి నుండి బయలుదేరి 27 వ తేదీ ఉదయం 09:30 గంటలకు సికింద్రాబాద్ కు చేరుకుంటుంది. ఇక రైలు నెంబర్ 02764 సికింద్రాబాద్ నుండి తిరుపతి వెళ్లే రైలు ఈ నెల 27 వ తేదీ సాయంత్రం 06:40 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి 28 వ తేదీ ఉదయం 06:45 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. అలానే తిరిగి ఈ నెల 28 వ తేదీ (ఆదివారం) సాయంత్రం 05:15 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి సోమవారం ఉదయం 05:55 గంటలకు సికింద్రాబాద్ వస్తుంది.
ఇక ఈ రైళ్లు ఏఏ స్టేషన్లలో ఆగుతాయనే వివరాలు చూస్తే.. సికింద్రాబాద్-తిరుపతి- సికింద్రాబాద్ స్పెషల్ రైళ్లు (07041/07042) కాచిగూడ, ఉమ్దానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తి రోడ్, గద్వాల్, రాయిచూర్, మంత్రాలయం రోడ్, గుంతకల్లు, తాడిపత్రి, ఎర్రగుంట్ల, రాజంపేట, రేణిగుంట స్టేషన్స్‌లో ఆగగా.. సికింద్రాబాద్-తిరుపతి-సికింద్రాబాద్ వెళ్లే స్పెషల్ రైళ్లు (02764/02763) జనగామ, కాజిపేట్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాలా, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణింగుంట స్టేషన్స్‌లో ఆగుతుందని.. ప్రయాణికులు ఈ విషయాన్ని గమించాల్సిందిగా దక్షిణ రైల్వే కోరింది.