- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Godavari:గోదావరికి వరద పోటు..క్రమక్రమంగా పెరుగుతున్న నీటి మట్టం
by Jakkula Mamatha |
X
దిశ,ఏలూరు:ఎగువన నాసిక్ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిలో వరద నీరు క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతానికి ఈ పెరుగుదల స్వల్పమే అయినప్పటికీ రాబోయే నాలుగైదు రోజుల్లో వరద తీవ్రత ఎక్కువవుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం పోలవరం ప్రాజక్టు వద్ద స్పిల్ వే ఎగువన 30.720 మీటర్ల నీటిమట్టం నమోదు కాగా, దిగువన 22 మీటర్ల నీటిమట్టం చేరుకుంది. దీంతో ప్రాజక్టు స్పిల్‌వే గేట్లు ఎత్తివేసి ఆరు లక్షల 9వేల 360 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు కృష్ణ వరద కారణంగా పట్టిసీమ ఎత్తిపోతల పథకం మోటార్లను ఆపు చేశారు. భద్రాచలం వద్ద నీటిమట్టం 32, 70 అడుగులుగా నమోదయింది. ఇంకా వర్షాలు ఉండడం, ఎగువన భారీ వర్షాలు తగ్గకపోవడంతో రానున్న రోజుల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Advertisement
Next Story