అదానీ కేసు.. ఏపీలోనూ భారీగా స్కాం.. జగన్ సర్కారుతో ఎంఓయూ

by Rani Yarlagadda |
అదానీ కేసు.. ఏపీలోనూ భారీగా స్కాం.. జగన్ సర్కారుతో ఎంఓయూ
X

దిశ, వెబ్ డెస్క్: భారతదేశ వ్యాపార దిగ్గజాల్లో ఒకరైన గౌతమ్ అదానీ (Gautam Adani), అతని మేనల్లుడు సాగర్ అదానీ (Sagar Adani) పై అమెరికాలో లంచం కేసు నమోదైన విషయం తెలిసిందే. ఇప్పుడీ కేసు పుణ్యమా అని ఏపీలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి బయటికొస్తోంది. గౌతమ్ అదానీ.. ఏపీ ఒప్పందాల కోసం రూ.1750 కోట్ల లంచం ఇచ్చినట్లు సమాచారం. అలాగే కేంద్ర ప్రభుత్వ అధికారులకు రూ.2029 కోట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. సీకీ ఒప్పందంలో వేలకోట్ల రూపాయలు చేతులు మారాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గౌతమ్ అదానీ 2021 ఆగస్టు7, సెప్టెంబర్ 12, నవంబర్ 20న ఏపీలో విదేశీ అధికారులతో భేటీ అయినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.

ఏపీలో డిస్కమ్ లు భారీ నష్టాల్లో ఉండటంతో.. విద్యుత్ ఒప్పందాలు స్పీడ్ గా పూర్తి చేసేందుకు అదానీ భారీగా ముడుపులందించారన్న నేరారోపణలు వస్తున్నాయి. ఇండియన్ ఎనర్జీ కంపెనీ, అనుబంధ సంస్థలకు పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు అమెరికాలో కూడా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ పేరుతో.. అక్రమ మార్గంలో నిధులు రాబట్టాలని భారత ప్రభుత్వ అధికారులకు సుమారు 265 మిలియన్ డాలర్ల లంచాలను ఆఫర్ చేసినట్లు కేసు నమోదైంది. ఈ మేరకు ప్రాసిక్యూటర్ గౌతమ్, సాగర్ అదానీలతో పాటు మరో ఆరుగురిపై కేసు నమోదు చేశారు.

ఇండియన్ ఎనర్జీ కంపెనీ అప్పటి సీఈవో వినీత్ జైన్ పై, అమెరికాలో లిస్టయిన ఓసియార్ ఎనర్జీ రంజిత్ గుప్తాపై కేసులు నమోదయ్యాయి. ఏపీలో రూ.40 వేల కోట్లతో ఓసియార్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు జగన్ ప్రభుత్వంతో సదరు కంపెనీ ఎంఓయూ కుదుర్చుకుంది. 2019 మే నుంచి 2024 జూన్ వరకు ఏపీ ప్రభుత్వంలో ఉన్న ఉన్నతాధికారి ఈ ఒప్పందంలో కీలక పాత్ర పోషించించారని తెలియడంతో ఆయన్నూ విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. దర్యాప్తు ప్రారంభించిన అమెరికా న్యాయశాఖ 2021-2024 మధ్య జరిగిన విద్యుత్ ఒప్పందాల్లో అధికారుల పాత్రపై దర్యాప్తు చేస్తోంది.

Advertisement

Next Story

Most Viewed