- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Breaking:విశాఖను వదిలే ప్రసక్తే లేదు.. స్పష్టం చేసిన టీడీపీ ఎమ్మెల్యే
దిశ డైనమిక్ బ్యూరో: ఈ రోజు(గురువారం) తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు విశాఖపట్నం లో విలేకరులతో సమావేశం అయ్యారు. ఈ నేపథ్యంలో అయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు విశాఖపట్నం లోనే పోటీ చెయ్యాలని ఉందని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. ఇక తాను విశాఖ నార్త్ నుండి పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. అలానే విశాఖ నార్త్ లో వేరే ఇన్ ఛార్జ్ ని పెట్టమని తాను అధిష్టానానికి సూచించినట్లు పేర్కొన్నారు.
కాగా తనని చీపురుపల్లి నుండి పోటీ చేయాల్సిందిగా టీడీపీ అధిష్టానం ఆదేశించిందని.. అయితే తాను ఇంకా చీపురుపల్లిపై నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. ఇక తాను విశాఖపట్నం జిల్లాలోనే పోటీ చేయాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు. తనని విశాఖపట్నం జిల్లా నుండి వేరే ప్రాంతానికి పంపాలి అని అధిష్టానం అనుకుంటే.. అధిష్టానానికి తన అభిప్రాయాలు చెప్తానని తెలిపారు.
కాగా ప్రతి ఎన్నికల్లోనూ నియోజకవర్గం మారుతున్నానని.. కానీ జిల్లా మారలేదని ఎప్పుడూ విశాఖ జిల్లాలోనే పోటీ చేస్తున్నానని.. ఈ సారి కూడా విశాఖ జిల్లాలోనే పోటీ చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఇక పొత్తు విషయానికి వస్తే.. టీడీపీ, జనసేన సీట్ల లెక్క ఇంకా తేలలేదని.. ఇప్పటికి కేవలం నాలుగు సీట్లపై మాత్రమే స్పష్టత వచ్చిందని పేర్కొన్నారు.
Read More..
మతోన్మాదంతో దేశాలు అభివృద్ధి చెందవు: సీపీఎం నేత బీవీ రాఘవులు