- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రాఖీ పండగ పూట తీవ్ర విషాదం.. ఫుడ్ పాయిజన్ కావడంతో నలుగురు విద్యార్థులు మృతి
దిశ, వెబ్ డెస్క్: రాఖీ పౌర్ణమి పండుగ పూట తీవ్ర విషాదం నెలకొంది. అనాథ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో నలుగురు విద్యార్థులు మృతి చెందారు. ఈ విషాద సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లిలోని కైలాస పట్నం అనాథ పాఠశాలలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో మరో ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది. ఆదివారం ఉదయం టిఫిన్ తిన్న తర్వాత మొత్తం 27 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కారణంగా వాంతులు, విరోచనాలు అవ్వడం తో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలను సేకరిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ ఫుడ్ పాయిజన్ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అలాగే ఈ ఘటనపై ఆర్డీవో జయరాం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. అలాగే పరిస్థితి విషమంగా ఉన్న విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించడం కోసం పలువురు విద్యార్థులను. కేజీహెచ్‌కు తరలించిన అధికారులు ఘటనపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు దిగ్భ్రాంతి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశించారు.
Read more...