Breaking:పోసానికి బిగ్ షాక్.. పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి

by srinivas |
Breaking:పోసానికి బిగ్ షాక్.. పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ మాజీ నేత, నటుడు పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali)కి బిగ్ షాక్ తగిలింది. రెండు రోజులు పాటు పోలీస్ కస్టడి(Police Custody)కి ఇస్తూ నరసరావుపేట కోర్టు(Narasaraopet Court) అనుమతించింది. ఈ మేరకు పోసానికి రేపు, ఎల్లుండి పోలీసులు విచారించనున్నారు. పోసాని కోరితే లాయర్ సమక్షంలో విచారణ చేయాలని సూచించింది. పోసాని బెయిల్ పిటిషన్‌పై విచారణను సోమవారానికి వాయిదా వేసింది.


కాగా చంద్రబాబు (Chandrababu), పవన్ కల్యాణ్‌(Pawan Kalyan), నారా లోకేశ్ (Nara Lokesh)పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో పోసాని కృష్ణమురళిపై నరసరావుపేట టుటౌన్‌పై కేసు నమోదు అయింది. ఈ కేసులో ఇప్పటికే పోసానిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే మరింత విచారణ చేయాలని, ఈ మేరకు పోసానిని ఐదు రోజులు పాటు కస్టడికి ఇవ్వాలని కోర్టును పోలీసులు అభ్యర్థించారు. ఈ మేరకు పోసానిని కస్టడీకి ఇస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Next Story

Most Viewed