ఉడత ఊపులకు భయపడం.. పవన్‌ను పేర్ని నాని స్ట్రాంగ్ వార్నింగ్

by srinivas |
ఉడత ఊపులకు భయపడం.. పవన్‌ను పేర్ని నాని స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: ఉడత ఊపులకు భయపడమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌(Ap Deputy Cm Pawan Kalyan)కు మాజీ మంత్రి పేర్ని నాని (Former Minister Perni Nani)స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మచిలీపట్నం(Machilipatnam)లో పేర్ని నాని ఇంటిని జనసేన కార్యకర్తలు (Janasena Leaders) ముట్టడించిన నేపథ్యంలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నలుగురు చెంచగాళ్లను తన ఇంటి వద్దకి పంపినంత మాత్రాన బెదిరిపోమని పేర్నినాని హెచ్చరించారు. నిన్నటి వరకూ తనకు కులం, మతం లేదని, ఇప్పుడు పవన్ రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. సినిమా నటుడై నాలుగు డ్యాన్స్‌లు వేసి పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారని సెటైర్లు వేశారు. పవన్ కల్యాణ్‌కు ఒక సిద్ధంతం లేదని, ఏది పడితే అది మాట్లాడతారని పేర్ని నాని విమర్శించారు. పవన్‌ వ్యాఖ్యలు మతాల మధ్య చిచ్చుపెట్టేలా ఉన్నాయన్నారు. ఎన్నికలకు ముందు కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూశారని ఆరోపించారు. ఇప్పుడు మతాల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్నారని పేర్ని నాని మండిపడ్డారు. బాప్టిజం తీసుకున్నానని గతంలో పవన్ కల్యాణ్ చెప్పారని, ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండి బాధ్యతారహితంగా ప్రవర్తించడం సిగ్గుమాలిన తనమని పేర్ని నాని మండిపడ్డారు.

కాగా తిరుమల లడ్డూ వివాదంపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై పేర్ని నాని విమర్శలు చేశారు. దీంతో జనసేన నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మచిలీపట్నంలోని పేర్ని నాని నివాసం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ క్రమంలో వైసీపీ (Ycp), జనసేన కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్‌పై పేర్ని నాని మరోసారి విమర్శలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed