- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సీఎం జగన్ సింహం కాదు.. పులివెందుల పిల్లి: మాజీ మంత్రి Kollu Ravindra సెటైర్
దిశ, వెబ్‌డెస్క్: సీఎం జగన్‌పై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ రెడ్డి ఏపీ డేరాబాబా అని అన్నారు. జగన్ పరదాల చాటున దాక్కుంటూ.. తాను సింహాన్ని అంటున్నారని ఎద్దేవా చేశారు. జగన్ రెడ్డి సింహం కాదని.. పులివెందుల పిల్లి అని కొల్లు రవీంద్ర సెటైర్లు వేశారు. జైలు జీవితం గడిపిన పక్షులకు జనం మెచ్చే నేతల గురించి తెలియదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు స్థాయి ఏమిటో.. సీఎం జగన్ బతుకేమిటో తెలుసుకోవాలని ఘాటు విమర్శలు చేశారు. బాబాయ్ హత్యకేసులో తన బాగోతం బయటపడకూడదనే.. సింహాం సింగల్‌గా ఢిల్లీ వెళ్లిందని ఆరోపించారు.
జగన్ రెడ్డి ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లినా.. తమ్ముడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డిని రక్షించలేడని అన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించడం దారుణమన్నారు. కాగా, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రపై వైసీపీ నేతలు, మంత్రులు విమర్శల వర్షం కురిపిస్తుండటంతో.. రంగంలోకి దిగిన టీడీపీ నేతలు సీఎం జగన్‌ను టార్గెట్ చేస్తూ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. వైసీపీ, టీడీపీ నేతల విమర్శలు, ప్రతి విమర్శలు, సవాళ్లతో ఏపీ రాజకీయాలు అప్పుడే ఎన్నికలను తలపిస్తున్నాయి.