తిరుమలలో గత ఐదేళ్లు మహా పాపం జరిగింది.. రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |   ( Updated:2024-09-20 06:16:11.0  )
తిరుమలలో గత ఐదేళ్లు మహా పాపం జరిగింది.. రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల లడ్డూ(Tirumala Laddu) వివాదం రాజకీయ దుమారం రేపుతోంది. వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యి శాంపిల్స్‌ను పరీక్షల కోసం నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డు ల్యాబొరేటరీకి పంపించారు. రిపోర్టులో కల్తీ నెయ్యి వాడినట్లు తేలింది. అంతేకాదు.. జంతువుల కొవ్వు వాడారని స్వయంగా సీఎం చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా.. ఈ వ్యవహారంపై తిరుమల ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు(Ramana Dikshitulu) స్పందించారు.

ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ‘గతంలో ఎన్నోసార్లు ప్రసాదం తయారీపై నేను ఫిర్యాదు చేశాను. కల్తీ నెయ్యితోనే శ్రీవారికి ప్రసాదాలు తయారు చేశారు. టీటీడీ బోర్డు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. నాకు అర్చకులు కూడా సహకరించలేదు. గత ఐదేళ్లు తిరుమలలో మహా పాపం జరిగింది. నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు రిపోర్టులు చూశా. కల్తీ నెయ్యిపై సమగ్ర విచారణ జరిపించాలి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని రమణ దీక్షితులు డిమాండ్ డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed