- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
YS Jagan:మరికొద్ది సేపట్లో ఇడుపులపాయకు చేరుకోనున్న మాజీ సీఎం.. కారణం ఇదే!
దిశ,వెబ్‌డెస్క్: మాజీ సీఎం వైఎస్ జగన్(Former CM YS Jagan) నేటి(మంగళవారం) నుంచి నాలుగు రోజుల పాటు కడప జిల్లా(Kadapa District)లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం 11 గంటలకు ఆయన బెంగళూరు(Bengaluru) నుంచి ఇడుపులపాయకు చేరుకోనున్నారు. ఈ క్రమంలో మొదటగా ఆయన తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి(YS Rajashekhar Reddy) ఘాట్ వద్ద నివాళి అర్పిస్తారు. ఆ తర్వాత ప్రేయర్ హాల్ లో జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం కడప నియోజకవర్గ నేతలతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 3.30 గంటలకు పులివెందుల(Pulivendula)కు బయలుదేరుతారు. రాత్రికి పులివెందులలోని నివాసంలో బస చేస్తారు.
రేపు ఉదయం 8.30 గంటలకు CSI చర్చిలో క్రిస్మస్(Christmas) వేడుకల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.30 గంటలకు తాతిరెడ్డిపల్లిలో రామాలయాన్ని ప్రారంభిస్తారు. మళ్లీ రాత్రికి పులివెందులలో బస చేస్తారు. 26న పులివెందుల క్యాంపు కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. 27వ తేదీ ఉదయం 9 గంటలకు పులివెందుల విజయ గార్డెన్స్(Vijaya Gardens)లో జరిగే వివాహానికి హాజరవుతారు. ఆ తర్వాత పులివెందుల నుంచి బెంగళూరు(Bengaluru)కు తిరుగు పయనమవుతారు.