- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
YS Jagan:‘సప్త సముద్రాల అవతల ఉన్నా వదిలిపెట్టాం’.. పోలీసులకు మాజీ సీఎం జగన్ మాస్ వార్నింగ్
దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో పోలీసుల తీరుపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్(YS Jagan) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ నేడు(గురువారం) మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు టోపీ పై ఉన్న మూడు సింహాలకు సెల్యూట్ కొట్టాలని జగన్ సూచించారు. ఇలా అమ్ముడుపోయి ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడం పోలీసులుగా వృత్తిని కించపరచడమే అవుతుందన్నారు. ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉండదని హెచ్చరించారు. చంద్రబాబు ఆదేశాలతో అక్రమ అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక సప్త సముద్రాల అవతల ఉన్న తీసుకొస్తామని హెచ్చరించారు. అన్ని బయటకు తీసి చట్టం ముందు దోషులుగా నిలబెడతమన్నారు. ఈ క్రమంలో ‘పోలీసులు అంటే గౌరవం ఉండాలి. వ్యవస్థ మంచిగా పని చేయాలి. ఈరోజు వాళ్లు అధికారంలో ఉండొచ్చు. రేపు మేము అధికారంలో ఉండొచ్చు. రాజకీయ నాయకులు చెప్పినట్లు చేస్తే.. మంచిది కాదు' అని వైఎస్ జగన్ సూచించారు.