Ap News: వన్యప్రాణుల సంరక్షణపై అటవీశాఖ కీలక నిర్ణయం

by srinivas |
Ap News: వన్యప్రాణుల సంరక్షణపై అటవీశాఖ  కీలక నిర్ణయం
X

దిశ, ఏపీ బ్యూరో: వన్యప్రాణులకు ఎలాంటి ముప్పు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను అటవీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఆదేశించారు. సచివాలయంలో గురువారం నిర్వహించిన తొలి స్టేట్ బోర్డు ఆఫ్ వైల్డ్ లైఫ్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.


రాష్ట్రంలోని అభయారణ్యాల్లో వన్యప్రాణుల సంరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై పెద్దిరెడ్డి సమీక్షించారు. కొల్లేరు, పాపికొండలు అభయారణ్యాల్లో వన్యప్రాణుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా అధికారులు వివరించారు. వన్యప్రాణుల సంరక్షణకు నిపుణులతో కూడిన కమిటీలను ఏర్పాటు చేసి వన్యప్రాణులపై ప్రభావాన్ని అధ్యయనం చేయాలని మంత్రి పెద్దిరెడ్డి సూచించారు.

Advertisement

Next Story