BRO Movie : బ్రో షో నిలిపివేత.. థియేటర్ వద్ద అభిమానుల రచ్చరచ్చ

by Seetharam |   ( Updated:2023-07-28 10:17:41.0  )
BRO Movie : బ్రో షో నిలిపివేత.. థియేటర్ వద్ద అభిమానుల రచ్చరచ్చ
X

దిశ, డైనమిక్ బ్యూరో : పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన బ్రో మూవీ ప్రపంచ వ్యాప్తంగా నేడు విడుదలైన సంగతి తెలిసిందే.ఈ సినిమా బెనిఫిట్ షోతోనే హిట్ టాక్ సొంతం చేసుకుంది. పవన్ కల్యాణ్, మేనల్లుడు సాయిధరమ్ తేజ్ క్రేజీ కాంబినేషన్ కావడంతో థియేటర్ల వద్ద మెగా అభిమానులు సందడి చేస్తున్నారు. భారీగా కటౌట్లు ఏర్పాటు చేయడంతో పాటు బాణసంచాకాల్చి సంబరాలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే నెల్లూరు జిల్లా కావలిలోని లతా థియేటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. థియేటర్ లో సౌండ్ సిస్టం ఫెయిల్ కావడంతో యాజమాన్యం షోను నిలిపివేసింది. దీంతో పవన్ కల్యాణ్‌ అభిమానులకు చిర్రెత్తుకొచ్చింది. థియేటర్ వద్ద నానా రచ్చ రచ్చ చేశారు. ఈ సందర్భంగా మెగా అభిమానులకు, థియేటర్ యాజమాన్యానికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. మరోవైపు గూడూరులోని సింగం థియేటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకింది. సినిమా విడుదల సందర్భంగా ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో పవన్ ఫ్యాన్స్‌లో రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఇరువర్గాలు గొడవకు దిగడంతో ఎక్కడ గొడవ పెద్దది అవుతందోనన్న భయంతో థియేటర్ యాజమాన్యం ఫ్లెక్సీలను చించేసింది. దీంతో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. థియేటర్ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో దిగివచ్చిన థియేటర్ యాజమాన్యం మళ్లీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంతో వివాదం సద్దుమణిగింది.

Advertisement

Next Story