పోలింగ్ రోజున వాడే సిరాపై తప్పుడు ప్రచారం.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఈసీ

by GSrikanth |
పోలింగ్ రోజున వాడే సిరాపై తప్పుడు ప్రచారం.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఈసీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఓటు వేసేముందు అందరి వేళ్లపై సిరా చుక్క వేసే విషయం తెలిసిందే. తెల్లవారితే ఎన్నికలు అనగా పోలింగ్ రోజున వాడే సిరాపై సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు విస్తృతమయ్యాయి. తాజాగా ఈ వార్తలపై ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ మీనా కుమారి స్పందించారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తాము పోలింగ్ రోజున వాడే చెరగని సిరా ఇతరుల వద్ద దొరకదు అని అన్నారు. భారత ఎన్నికల సంఘం వద్ద మాత్రమే చెరగని సిరా ఉంటుందని అన్నారు. ఒకవేళ ఇతర సిరాలతో ఓటర్ల వేళ్లపై మార్కు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల వేళ ఎవరు నిబంధనలు ఉల్లంఘించిన ఏమాత్రం సహించబోము అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కాగా, ఎన్నికల సిరా దుర్వినియోగం జరుగుతోదని జనసేన నేత కొనిదెల నాగబాబు ఆరోపించిన విషయం తెలిసిందే. ఎవరైనా వేళ్లపై ఫేక్ సిరా వేస్తే వేయించుకోవద్దని ఓటర్లకు సూచించారు. ఓటు వేయడానికి ముందే వేలిపై సిరా గుర్తు ఉంటే ఆయా ఓటర్లను ఎన్నికల అధికారులు అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉందని ఎవరైనా వేళ్ళపై సిరా చుక్క వేస్తామని చెబితే ప్రజలు తిరస్కరించాలని కోరారు. మిమ్మల్ని అడ్డుకోవడం అంటే మిమ్మల్ని చంపేయడమేనని, మీ ఆత్మగౌరవాన్ని కించపరచటమేనని చెప్పారు. తాజాగా ఈ అంశంపై ఈసీ స్పందించి తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.



Next Story