ఎట్టకేలకు ప్రధాని మోడీ, జగన్ రిలేషన్ బట్టబయలు: మాజీ మంత్రి జేడీ శీలం కీలక వ్యాఖ్యలు

by Satheesh |
ఎట్టకేలకు ప్రధాని మోడీ, జగన్ రిలేషన్ బట్టబయలు: మాజీ మంత్రి జేడీ శీలం కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: లోక్ సభ స్పీకర్ ఎన్నికలో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ ఎన్డీఏ కూటమికి మద్దతు పలికింది. టీడీపీ, జనసేనలతో కలిసి తమను ఓడించిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు జగన్ మద్దతు ఇవ్వడం పొలిటికల్ సర్కిల్స్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ఎన్డీఏకు వైసీపీ మద్దతు ఇవ్వడంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జేడీ శీలం ఫైర్ అయ్యారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లోక్ సభ స్పీకర్ ఎన్నికలో వైసీపీ ఎన్డీఏకు మద్దతు ఇస్తామని ప్రకటించడంతో ప్రధాని మోడీ, వైఎస్ జగన్ మధ్య సంబంధం ఎట్టకేలకు బయటపడిందని అన్నారు. స్పీకర్ ఎన్నికకు మద్దతు ఇస్తామన్నారు.. ఆ తర్వాత ఐదేళ్ల పాటు కూడా మోడీకి మద్దతు ఇస్తూనే ఉంటారని ఫైర్ అయ్యారు. వైసీపీలోని బడుగు, బలహీన వర్గాలు ఇకనైనా కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపర్చాలని కోరారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించుకుందామని

Advertisement

Next Story