బస్సు ప్రమాద మృతులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం

by Gantepaka Srikanth |   ( Updated:2024-09-13 13:39:46.0  )
బస్సు ప్రమాద మృతులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం
X

దిశ, వెబ్‌డెస్క్: చిత్తూరు బస్సు ప్రమాదంలో దాదాపు 8 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. మరో 30మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందన్నారు. ఈ ప్రమాదంపై స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యారోగ్య శాఖను ఆదేశించారు.

ప్రస్తుతం చిత్తూరు జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌, ఎస్పీ ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. పలమనేరు వైపు నుంచి ఐరన్‌ లోడుతో వెళ్తున్న లారీని చిత్తూరు వైపు నుంచి పలమనేరు వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. అదే సమయంలో మితిమీరిన వేగంతో వస్తున్న లారీ అదుపుతప్పి పక్క రోడ్డులో ఎదురుగా వస్తున్న బస్సు పైకి దూసుకెళ్ళింది. ఘటనలో ఆర్డీసీ డ్రైవర్‍ తోపాటు 8 మంది ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు.

Advertisement

Next Story