ఏపీ బడ్జెట్ రెడీ..రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు

by srinivas |   ( Updated:2024-11-10 16:35:44.0  )
ఏపీ బడ్జెట్ రెడీ..రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ అసెంబ్లీ సమావేశాల(AP Assembly Session)కు సర్వం సిద్ధమైంది. సోమవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ, శాసనమండలి(Legislative Council) సమావేశాలు ప్రారంభంకానున్నాయి. సభలు ప్రారంభమైన వెంటనే గవర్నర్ అబ్దుల్ నజీర్(Governor Abdul Nazeer) ప్రసంగిస్తారు. అనంతరం రాష్ట్ర బడ్జెట్‌(Budget)ను ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్(Finance Minister Payyavula Keshav) ప్రవేశ పెట్టనున్నారు. అయితే అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి సీఎం చంద్రబాబు(CM Chandrababu) అధ్యక్షతన ఏపీ కేబినెట్(AP Cabinet) భేటీ అవుతుంది. రాష్ట్ర వార్షిక బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ప్రస్తుత ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమయం నవంబర్ చివరితో ముగియనుండటంతో సమావేశాల తొలిరోజు (సోమవారం) అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నారు.

అలాగే వ్యవసాయం బడ్జెట్‌ను మంత్రి అచ్చెన్నాయుడు(Minister Atchennaidu) ప్రవేశపెట్టనున్నారు. శాసనమండలిలో బడ్జెట్‌ను మంత్రి కొల్లు రవీంద్ర(Minister Kollu Ravindra), వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి నారాయణ(Minister Narayana) ప్రవేశ పెట్టనున్నారు. అనంతరం ఉభయ సభలు వాయిదా పడనున్నాయి. ఆ తర్వాత బీజేసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశాలను 12 రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశాలను హాజరుకానని ఇప్పటికే వైసీపీ అధినేత జగన్(YSRCP chief Ys Jagan) ప్రకటించారు. అయితే మండలి సమావేశాలను వైసీపీ ఎమ్మెల్సీలు హాజరవ్వాలని నిర్ణయించుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed