- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జమ్మలమడుగులో అల్లర్లు.. ముగ్గురు అభ్యర్థులను ఊరు దాటించిన పోలీసులు
దిశ, వెబ్ డెస్క్: ఏపీ ఎన్నికల వేళ పలుచోట్ల ఉద్రిక్తలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే కోడ్ అమల్లో ఉండగా ఈ ఘటనలు జరగడంపట్ల కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయా అధికారులపై వేటు వేసింది. అంతేకాదు కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ఫలితాల తర్వాత 15 రోజులు వరకు పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని హోంశాఖను ఆదేశించింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగడానికి వీల్లేదని హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. అవసరమైతే భారీగా కేంద్రబలగాలను వినియోగించుకోవాలని సూచించింది.
దీంతో పోలీసులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఈసీ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ఊరు దాటిస్తున్నారు. వారి ఇళ్ల వద్ద భారీగా మోహరించారు. కడప జిల్లా జమ్మలమడుగులో మూడు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థుల కదలికలపై ఫోకస్ పెట్టారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్ రెడ్డిని హైదరాబాద్ తరలించారు. కడప టీడీపీ ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డిని బనగానపల్లికి పంపారు. జమ్మలమడుగు బీజేపీ అభ్యర్థి ఆది నారాయణరెడ్డిని హైదరాబాద్‌కు తరలించారు. మూడు రోజులుగా ఈ అభ్యర్థులను హౌస్ అరెస్ట్ చేశారు. గ్రామంలో ఉంటే మళ్లీ ఉద్రిక్తతలు చోటు చేసుకునే అవకాశం ఉందని వీరిని బయట ప్రాంతాలను తరలించారు.