Cheetah: చిరుత కోసం సెర్చ్ ఆపరేషన్.. ఎక్కడంటే..!

by srinivas |
Cheetah: చిరుత కోసం సెర్చ్ ఆపరేషన్.. ఎక్కడంటే..!
X

దిశ, వెబ్ డెస్క్: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి అటవీ ప్రాంతంలో కనిపించిన చిరుత కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. స్థానిక లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీ, దివాన్ చెరువు పుష్కరవనం మధ్య ప్రాంతం నివాసాల్లో చిరుత సంచరించింది. నల్లని జంతువుపై దాడి చేసి దివాన్ చెరువు నేషనల్ హైవే దాటుతుండగా చిరుతను కొందరు వాహనదారులు చూశారు. ఆ దృశ్యాలను వారి ఫోన్లలో చిత్రీరించారు. వెంటనే అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందజేశారు.

దీంతో చిరుతపులిని బంధించేందుకు అటవీ శాఖ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. దివాన్ చెరువు పరిసరాల్లో 36 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయినా చిరుత ఆచూకీ దొరకలేదు. దీంతో దివాన్ చెరువు పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. రాత్రి సమయంలో బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. చిన్న పిల్లలను ఇంటి నుంచి బయటకు పంపడం లేదు. పెద్దలు ఆరుబయట కూర్చోవడంలేదు. తమను చిరుత ఎప్పుడు ఏం చేస్తుందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా చిరుతను బంధించాలని కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed