- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చంద్రబాబు నిర్దోషిగా బయటకొస్తారు: Nara Brahmini
దిశ, వెబ్ డెస్క్: టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్దోషిగా బయటకొస్తారని నారా బ్రాహ్మిణి అన్నారు. చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల్లో లబ్ధి కోసమే చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. చంద్రబాబు, లోకేశ్‌కు వస్తున్న మద్దతు చూసి ఇలాంటివాటికి పాల్పడ్డారని బ్రాహ్మిణి ఆగ్రహం వ్యక్తం చేశారు. 42 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నేతను జైల్లో పెట్టడం దారణమన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను చంద్రబాబు చాలా అభివృద్ధి చేశారని బ్రాహ్మిణి గుర్తు చేశారు. ప్రజల కోసమే చంద్రబాబు కష్టపడేవారని తెలిపారు.
రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే చంద్రబాబు చేసిన నేరమా అని నారా బ్రాహ్మిణి ప్రశ్నించారు. ప్రజలు స్వచ్ఛంగా చంద్రబాబు మద్దతు తెలుపుతున్నారని ఆమె పేర్కొన్నారు. జాతీయ నేతలు సైతం ఏపీ ప్రభుత్వాన్ని తప్పుబడుతున్నారని చెప్పారు. కోర్టులపై తమకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేస్తారని తామేప్పుడు అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఐడీ దాఖలు చేసిన చార్జ్ షీట్లో ఏమి లేదని ఎనిమిదేళ్ల దేవాన్ష్‌ను అడిగిన చెబుతాడని బ్రాహ్మిణి సెటైర్ వేశారు. యువతకు ఉద్యోగాలు కల్పించడమే తప్పా అని నారా బ్రాహ్మిణి నిలదీశారు.