Kakinada: బోటులో అగ్నిప్రమాదం.. 11 మందిని రక్షించిన కోస్ట్ గార్డ్స్

by srinivas |   ( Updated:2023-12-01 05:57:03.0  )
Kakinada: బోటులో అగ్నిప్రమాదం.. 11 మందిని రక్షించిన కోస్ట్ గార్డ్స్
X

దిశ, వెబ్ డెస్క్: కాకినాడ తీరంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. వేటకు వెళ్తున్న మత్య్సకారుల బోటులో మంటలు చెలరేగాయి. గ్యాస్ సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు బోటు మొత్తం అంటుకున్నాయి. దీంతో మత్య్సకారులు లైఫ్ జాకెట్లు ధరించి సముద్రంలోకి దూకేశారు. విషయం తెలుసుకున్న కోస్ట్ గార్డ్ సిబ్బంది ప్రాణాలకు తెగించి రెస్యూ ఆపరేషన్ చేశారు. సముద్రంలో కొట్టుకుపోతున్న 11 మందిని సురక్షింతంగా ఒడ్డుకు చేర్చారు. లైఫ్ జాకెట్లు ధరించడం, కోస్ట్ గార్డ్ సిబ్బంది ప్రాణాలకు తెగించి రెస్యూ ఆపరేషన్ చేయడంతో మత్య్సకారులకు ప్రాణ ముప్పు తప్పింది. దీంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Next Story