- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Breaking: దువ్వాడ శ్రీనివాస్ నివాసం వద్ద మళ్లీ ఉద్రిక్తత.. భార్య వాణి ఆందోళన
దిశ, వెబ్ డెస్క్: శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ ఇంటి పంచాయితీ మరింత ముదిరింది. తన భర్త దువ్వాడ శ్రీనివాస్ వేరే మహిళతో సహజీవనం చేస్తూ తమకు అన్యాయం చేస్తున్నారంటూ భార్య ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం అర్ధరాత్రి దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద తమ కూతుళ్లతో కలిసి నిరసన వ్యక్తం చేసిన ఆమె మళ్లీ ఈ రోజు నిరసనకు దిగారు. దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర బైఠాయించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ తమ ఆస్తులు తీసుకున్నారని, వాటిని ఇవ్వాలని ఆమె కోరారు. దువ్వాడ శ్రీనివాస్ తల్లి లీలావతి చేసిన ఆరోపణలపై వాణి స్పందిస్తూ తాము ఎవరితో కలిసి మద్యం సేవించామో చెప్పాలన్నారు. దువ్వాడ శ్రీనివాస్ తల్లి నీచంగా మాట్లాడుతున్నారని, ఒక మహిళ అయి ఉండి అలా మాట్లాడటం సబబేనా అని ప్రశ్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో దువ్వాడ శ్రీనివాస్‌ను జగన్ ఎలా ఉంచారని వాణి నిలదీశారు. దువ్వాడను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆయన భార్య వాణి డిమాండ్ చేశారు.