Breaking: అనంతపురం, విజయవాడలో భారీ వర్షం

by srinivas |
Breaking: అనంతపురం, విజయవాడలో భారీ వర్షం
X

దిశ, వెబ్ డెస్క్: తుఫాను ప్రభావంతో ఏపీలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. అనంతపురం జిల్లాతో పాటు విజయవాడలోనూ గాలి వాన బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా ఈదులు గాలులతో కూడిన వాన పడింది. దీంతో పొలాల్లో నీరు చేరింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనంతపురం జిల్లా ఉరవకొండ, విడపకల్లు మండలాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లాయి. బూదగవి చెరువుకు భారీగా వరద నీరు చేరింది. విడపకల్లు మండలంలో వర్షం దెబ్బకు 19 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పొలికి -పెంచులపాటు, గోవిందవాడ-పాల్తూరు గ్రామాల మధ్య వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది.

అటు విజయవాడలోనూ వర్షం కుమ్మేసింది. గన్నవరం ప్రాంతాల్లో అయితే ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో గౌడపేట, వీఎస్‌పురంతో పాటు పలు కాలనీలు నీట మునిగాయి. పలు చోట్ల ఇళ్లలోకి నీరు చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అప్రమత్తమైన మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. లోతట్టు ప్రాంతాల్లోని నీటిని మోటర్ల ద్వారా తొలగిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed