ఏపీ ఎన్నికలపై డైరెక్టర్ హరీష్ శంకర్ సంచలన ట్వీట్

by Rajesh |   ( Updated:2024-05-13 20:41:34.0  )
ఏపీ ఎన్నికలపై డైరెక్టర్ హరీష్ శంకర్ సంచలన ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ వేళ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ సంచలన ట్వీట్ చేశారు. ‘రాజకీయాల్లో వచ్చి సంపాదించిన నాయకులు కాదు.. సంపాదించింది రాజకీయాల్లోకి వచ్చి ప్రజల కోసం ఖర్చు పెట్టిన నాయకున్ని గుర్తించండి. ఎవరో బటన్ నొక్కితే బతికే కర్మ మనకు లేదు. మన బటన్ మనమే నొక్కాలి.. అదే ఈ ఈవీఎం బటన్ అవ్వాలి. ఓటు మన హక్కు మాత్రమే కాదు మన బాధ్యత కూడా’ అని హరీష్ శంకర్ ట్వీట్ చేశారు. అయితే పరోక్షంగా పవన్ కల్యాణ్‌కు మద్దతుగా హరీష్ శంకర్ ట్వీట్ పెట్టగా అదే సమయంలో జగన్ మోహన్ రెడ్డిపై సెటైర్లు వేశారు. ప్రస్తుతం హరీష్ శంకర్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Next Story