Pawan Kalyan :పోర్ట్ బ్లెయిర్ పేరు మార్పు పై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్

by Jakkula Mamatha |   ( Updated:2024-09-15 12:17:12.0  )
Pawan Kalyan :పోర్ట్ బ్లెయిర్ పేరు మార్పు పై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్
X

దిశ,వెబ్‌డెస్క్:అండమాన్ అండ్ నికోబార్ దీవుల రాజధాని ‘పోర్ట్ బ్లెయిర్’ పేరును మారుస్తూ కేంద్రం నిన్న(శుక్రవారం) నిర్ణయం తీసుకుంది. బ్రిటిష్ వలస పాలన నాటి పేర్లను మార్చే క్రమంలో కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్(Andaman Nicobar) రాజధాని పోర్ట్‌బ్లెయిర్(Port Blair) పేరును ‘శ్రీ విజయపురం’గా (Sri Vijayapuram) మార్చుతూ కేంద్రప్రభుత్వం(Central Govt) ప్రకటించింది. ఈ ప్రకటన పై తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు.

ప్రధాని మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని హ‌ృదయపూర్వకంగా స్వాగతిస్తున్నానని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రకటించారు. శతాబ్దాలపాటు(For centuries) దేశాన్ని అణచివేసిన వలస పాలనకు ప్రతిబింబంగా ఉన్న పేరును మార్చాలనే నిర్ణయం భారత్ సాధించిన విజయాలను (Achievements) మరింత గౌరవింప చేస్తుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇది ప్రశంసనీయమైన చర్య అన్నారు. వలస వారసత్వం ప్రభావం నుంచి భవిష్యత్ తరాలను సంరక్షించడానికి ఈ నిర్ణయం ఎంతో దోహదం చేస్తుందని తాను నమ్ముతున్నట్టు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ట్విట్టర్ వేదికగా తెలిపారు.




Advertisement

Next Story

Most Viewed