Pawan Kalyan: ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది

by Gantepaka Srikanth |
Pawan Kalyan: ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు ప్రజల(Telugu People)కు జనసేన(Janasena) అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేశారు. ‘రంగవల్లులు.. గొబ్బెమ్మలు.. గంగిరెద్దులు.. హరిదాసులు.. భోగిమంటలు.. పిండివంటల సమ్మేళనమే సంక్రాంతి. అటువంటి సరదాల కోసం నగరాలన్నీ పల్లెల వైపు పరుగులు తీశాయి. ఇది ప్రజలకు పండుగపై ఉన్న మక్కువను తెలియజేస్తుంది. ఉపాధి కోసం పల్లె బిడ్డలు నగరాలకు వలసపోవడంతో గ్రామాలు జనాలు లేక కొంతవరకు పలుచబడ్డాయి. ఈ సంక్రాంతి వేళ పల్లెలు పిల్లాపాపలతో కళకళలాడుతుంటే సంతోషంగా ఉంది. పల్లె సౌభాగ్యమే దేశ సౌభాగ్యం. ఆనందాలు, సిరిసంపదలతో సుభిక్షంగా శోభిల్లాలని, తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో విరాజిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.


Next Story

Most Viewed