- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
భూమన నాశనం మొదలైంది: దుర్గమ్మ సన్నిధిలో పవన్ కల్యాణ్ జోస్యం
దిశ, వెబ్ డెస్క్: టీటీడీ మాజీ చైర్మన్లు భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy), వైవీ సుబ్బారెడ్డి (Yv Subbareddy)కి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Ap Deputy Cm Pawan Kalyan) కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల (Tirumala)లో ప్రమాణం పేరుతో భూమన చేసిన హైడ్రామాపై ఆయన స్పందించారు. లడ్డూ పవిత్రతపై వ్యంగ్యంగా మాట్లాడారని, భూమన నాశనం మొదలైందని పవన్ వ్యాఖ్యానించారు. విజిలెన్స్ విచారణకు వైవీని పిలిస్తే రికార్డులు ఇవ్వాలా అని ప్రశ్నించారు. వైవీ సుబ్బారెడ్డి కచ్చితంగా విచారణకు రావాల్సిందేనని హెచ్చరించారు. జగన్ హయాంలో తిరుమలను ఇష్ట్యారాజ్యంగా చేశారని టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి (TTD Former EO Dharma Reddy)పై పవన్ కల్యాణ్ మండిపడ్డారు. తాను శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు ధర్మారెడ్డి వ్యహరించిన తీరును పరిశీలించానని చెప్పారు. లడ్డూపై ఇంత వివాదం జరుగుతుంటే ధర్మారెడ్డి ఏమయ్యారని ప్రశ్నించారు. తిరుమలను వ్యాపార కేంద్రంగా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధ్యాత్మిక కేంద్రాన్ని పర్యటక కేంద్రంగా చేశారని పవన్ ధ్వజమెత్తారు. ధర్మారెడ్డి కుమారుడు చనిపోతే 11 రోజులు గడవకముందే తిరుమల ఆలయంలోకి వచ్చి ఆపచారం చేశారని గుర్తు చేశారు. సనాతన ధర్మంపై పోరాటం చేస్తే తమను ఎవరూ ఆపలేరని పవన్ హెచ్చరించారు.