వానల జోరు వ్యాధులతో బేజారు..పల్లెల్లో డెంగ్యూ, చికెన్ గున్యా గుబులు

by Jakkula Mamatha |
వానల జోరు వ్యాధులతో బేజారు..పల్లెల్లో డెంగ్యూ, చికెన్ గున్యా గుబులు
X

దిశ,సత్తెనపల్లి: పల్నాడు పల్లెల్లో డెంగ్యూ గుబులు రేపుతోంది. ఇప్పటికే పలు గ్రామాల్లో డెంగ్యూ జ్వరాలతో జనం మంచం పడుతున్నారు. ఇటివల సత్తెనపల్లి క్రోసూరు రాజుపాలెం మండలాల్లో డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. అయితే నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మళ్లీ ఇక్కడ ఆందోళన మొదలైంది. నీటి నిల్వలు పెరిగితే అవి దోమలకు ఆవాస కేంద్రాలుగా మారుతాయని అధికారులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి దోమల నివారణ పై అవగాహన కలిగి ఉండాలని సూచిస్తున్నారు.

ఒకే దోమ కాటుకు రెండు వ్యాధులు

ఏడిస్ ఈజిప్టి డెంగ్యూ చికెన్ గున్యా లాంటి రెండు రకాల వ్యాధులకు కారణం అవుతుందని వైద్యులు చెబుతున్నారు. ట్రాపికల్ ఫీవర్ ప్యానెల్ పరీక్షల్లో ఇది నిర్ధారణ అయిందంటున్నారు. ఇటీవల అధిక జ్వరం కీళ్ల నొప్పులు ఉన్న రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించగా వారిలో పలువురుకి చికున్ గున్యా ఉన్నట్లుగా తేలిందంటున్నారు. దోమ కాటుతో డెంగ్యూ జ్వరం వస్తుంది.అయితే ఈ వ్యాధి లక్షణాలు ముదిరి చికున్ గున్యా మారుతున్నాయని చెబుతున్నారు. సడెన్ గా జ్వరం రావడం. తలనోప్పి కళ్ల కింద వాపు శరీరం దద్దుర్లు ఏర్పడటం డెంగ్యూ ఫీవర్ లక్షణాలుగా పేర్కొంటున్నారు. విపరీతమైన జ్వరం వాంతులు ముక్కు నుంచి రక్తం కారడం ప్లేట్ లెట్స్ కౌంట్ తగ్గడం చికున్ గున్యా లక్షణాలు అని చెబుతున్నారు.

భవిష్యత్తులో అర్థరైటిస్ ప్రమాదం

జ్వరంతో పలువురికి డెంగ్యూ పరీక్షల్లో నెగటివ్ వస్తున్నప్పటికీ ఇతర లక్షణాలు ఉంటే చికున్ గున్యా గుర్తించి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. డెంగ్యూ సోకిన వారిలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే యాంటీబాడీస్ ఉంటాయంటున్నారు. కానీ చికున్ గున్యా వైరస్ ఎదుర్కునేంతగా యాంటీబాడీస్ ఉండవని అంటున్నారు. చికున్ గున్యా సోకిన వారికి భవిష్యత్తులో దీర్ఘకాలిక అర్థరైటిస్ వచ్చే ప్రమాదం ఉందని అభిప్రాయపడుతున్నారు. వర్షాకాలం కావడంతో గ్రామంలో కాలనీలో దోమలు వృద్ధి చెందకుండా నివారణ చర్యలు తీసుకోవాలని అంటున్నారు. వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రులను సందర్శించి చికిత్స చేయించుకోవాలని వైద్యులు చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed