నన్ను అంతమెుందించేందుకు వామపక్ష తీవ్రవాదుల కుట్ర: ఏసీబీ జడ్జికి చంద్రబాబు లేఖ

by Seetharam |   ( Updated:2023-10-27 08:07:32.0  )
నన్ను అంతమెుందించేందుకు వామపక్ష తీవ్రవాదుల కుట్ర: ఏసీబీ జడ్జికి చంద్రబాబు లేఖ
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో తన భద్రత, ఆరోగ్యంపై అనుమానాలు ఉన్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి చంద్రబాబు విజయవాడ ఏసీబీ జడ్జికి లేఖ రాశారు. ఈనెల 25న చంద్రబాబు మూడు పేజీల లేఖను జడ్జికి రాశారు. రాజమహేంద్రవరం జైలు అధికారుల ద్వారా ఆ లేఖను జడ్జికి అందజేశారు. తాను జైల్లోకి వచ్చినప్పుడు అనధికారికంగా వీడియోలు, ఫోటోలు చిత్రీకరించారని లేఖలో చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఆ వీడియోలు, ఫోటోలను కావాలనే పోలీసులు స్వయంగా లీక్ చేశారని ఆరోపించారు. తన రెప్యుటేషన్‌ను దెబ్బతీసేందుకు ఈ తరమా వీడియోలు చిత్రీకరించి రిలీజ్ చేశారని చంద్రబాబు ఆరోపించారు. రని అన్నారు.తనన అంతమెుందించేందుకు వామపక్ష తీవ్ర వాదుల ప్రయత్నం చేస్తున్నారని లేఖలో ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి ఇప్పటికే లేఖ వచ్చినట్లు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అయితే ఆ లేఖపై ఇప్పటి వరకు పోలీసు అధికారులు విచారణ చేపట్టడం లేదు అని చంద్రబాబు నాయుడు ఆరోపించారు.


డ్రోన్‌తో నా కదలికలపై ఆరా

‘నాకు భద్రత నేపథ్యంలో జెడ్ ప్లస్ క్యాటగిరీ సెక్యూరిటీ ఉంది. అయినప్పటికీ జైల్లో నా ప్రాణాలకు ముప్పు ఉంది. జైలులో ఇటీవల జరిగిన కొన్ని ఘటనలే అందుకు నిదర్శనం’ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖలో ఆరోపించారు.‘నేను జైల్లోకి వచ్చినప్పుడు అనధికారికంగా నన్ను వీడియోలు, ఫొటోలు తీశారు. ఆ ఫుటేజ్‌ను స్వయంగా పోలీసులే లీక్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నా రెప్యూటేషన్‌ను దెబ్బ తీసేందుకే ఈ తరహా వీడియో ఫుటేజ్ రిలీజ్ చేశారు. దీని వెనుక వైసీపీ కుట్ర ఉందని నేను అనుమానిస్తున్నాను. ఈ నెల 6న నన్ను కలవడానికి నా కుటుంబసభ్యులు వచ్చిన సందర్భంలో సెంట్రల్ జైలు మెయిన్ గేట్ వద్ద మరో డ్రోన్ ఎగరేశారు. ఈ డ్రోన్ఎగురవేసింది వైసీపీ వారేనని అనుమానం కలుగుతుంది. డ్రోన్ విషయంపై జైలు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.డ్రోన్ వదిలిన కేసులో ప్రధాన సూత్రధారిని పట్టుకోలేదు. ఈ వ్యవహారంలో జైలు అధికారుల నిస్సహాయతకు ఇది నిదర్శనం’ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖలో ఆరోపించారు.

చంపేందుకు కుట్ర

రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో నన్ను అంతమొందించేందుకు కుట్ర జరుగుతుందని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి అజ్ఞాత లేఖ వచ్చింది. ఆ లేఖలో తనను అంతమెుందించేందుకు వామపక్ష తీవ్రవాదులు కుట్ర పన్నుతున్నారని ఆ అజ్ఞాత లేఖ ద్వారా తెలియజేశారు. నన్ను చంపేందుకు రూ.కోట్లు చేతులు మారినట్లు తెలుస్తోంది. ఇంత జరిగిన ఆ అజ్ఞాత లేఖపై ఇప్పటి వరకు పోలీస్ అధికారులు ఎలాంటి విచారణ చేపట్టలేదు’ అనుకోని ఈ ఘటనల వెనుక సూత్రధారి ఎవరు అనే అంశంపై పోలీస్ శాఖ ఎలాంటి విచారణ చేపట్టడం లేదు అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖలో ఆరోపించారు.

పెన్ కెమెరాతో నా ఫోటోలు తీస్తున్నారు

‘రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో నా భద్రతపై అనేక అనుమానాలు ఉన్నాయి. నాకు ప్రాణ హాని ఉంది’ అని మరోసారి చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. ‘ఎస్ కోటకి చెందిన ఓ ముద్దాయి జైల్లో పెన్ కెమెరాతో విజువల్స్ తీస్తున్నారని నా దృష్టికి వచ్చింది. పెన్ కెమెరాలతో నా పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నాడు. నా కదలికలను ఆ పెన్ కెమెరాతో ఫోటోలు తీస్తున్నాడు. అంతేకాదు జైలులోకి గంజాయి ప్యాకెట్లను విసురుతున్నారు. జైలు ప్రాంగణంలోని గార్డెనింగ్ చేస్తున్న ఖైదీల వద్దకు ఆ గంజాయి ప్యాకెట్లు విసురుతున్నారు. ఇకపోతే జైలులో మెుత్తం 2,200 మంది ఖైదీలు ఉన్నారు. అయితే వారిలో 750 మంది డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన వారే. ఈ అంశాలు నా భద్రతకు తీవ్ర ఇబ్బందికరంగా మారాయి. అంతేకాదు నా ప్రాణానికి తీవ్రమైన ముప్పుగా అనిపిస్తోంది’ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖలో ఆరోపించారు.

నా కుటుంబ సభ్యులకు ప్రమాదం పొంచి ఉంది

నా భద్రతే కాదు. నా కుటుంబ సభ్యులకు ప్రమాదం పొంచి ఉందనే ఆందోళనతో ఉన్నాను అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. నాలుగున్నరేళ్ల కాలంలో నాపై వివిధ సందర్భాల్లో అధికారంలో ఉన్న వాళ్లు దాడులు చేశారు అని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఈ పరిణామాలను పరిశీలిస్తే నాతోపాటు నా కుటుంబ సభ్యులకు కూడా ప్రాణహాని ఉందనే అనుమానం కలుగుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

Read More: చంద్రబాబు బెయిల్ పిటిషన్: నాట్ బిఫోర్ మీ అన్న న్యాయమూర్తి

Advertisement

Next Story

Most Viewed