- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జగన్ కు మోడీ దర్శనం దొరికినందుకు అభినందనలు.. ఏం సాదించారో?
దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ కు ప్రధాని మోదీ దర్శనం దొరికినందుకు అభినందనలు తెలుపుతున్నానని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఢిల్లీ వెళ్లి జగన్ ఏం సాదించారో తెలియదు కానీ, ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ సార్లు ఢిల్లీ వెళ్లింది సీఎం జగన్ ఒక్కడే అని ఎద్దేవా చేశారు. ఇసుక, మద్యం నుంచి వచ్చే అవినీతి సొమ్ము నుంచి జగన్ తోపాటు బీజేపీకి వాటాలు వెళ్తున్నాయిన తీవ్ర ఆరోపణలు చేవారు.
అందుకే ఇసుక, మద్యం లాంటి తదితర కుంభకోణాల్లో దేశంలోని చాలామంది నేతలు అరెస్టు అవుతున్న ఏపీ నేతలకు మాత్రమే అరెస్టుల నుంచి మినహాయింపు ఇచ్చారని తెలియజేశారు. ఈడీ, ఇన్ కం ట్యాక్స్, మోడీ దృష్టిలో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఏపీ ప్రభుత్వం ఒక్కటే ఎటువంటి మరక లేకుండా కనిపిస్తుందని అన్నారు. అంతేగాక ఏపీలోని మంత్రులు, ఎంపీలపై కేసులు ఎందుకు పెట్టలేదో చెప్పాలని బీజేపీని ప్రశ్నించారు. అలాగే వైసీపీ ప్రభుత్వం పోలవరాన్ని ఒక ఏటీఎంలా వాడుకుంటోందని విమర్శించారు. ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చిందని, ఆ హామీని ఎందుకు నిలబెట్టుకోలేదని ప్రశ్నించారు. అలాగే విభజన చట్టంలోని హామీలు నెరవేర్చేవరకు నా శక్తికి మించి పోరాడానని తెలియజేశారు.