చంద్రబాబు కంటి సమస్యపై ఆందోళన: ఏం జరుగుతుందోనని టీడీపీలో ఆందోళన

by Seetharam |
చంద్రబాబు కంటి సమస్యపై ఆందోళన: ఏం జరుగుతుందోనని టీడీపీలో ఆందోళన
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. స్కిల్ స్కాం కేసులో 45 రోజులకు పైగా రిమాండ్‌లో ఉన్నారు. అయితే చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ ఆందోళన చెందుతోంది. ఇటీవల అలర్జీ, డీహైడ్రేషన్‌ వంటి సమస్యలతో చంద్రబాబు నాయుడు బాధపడినప్పుడు టీడీపీ పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా చంద్రబాబు నాయుడు కంటి సమస్యలపై కుటుంబ సభ్యులు, టీడీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. జైల్లో చంద్రబాబు నాయుడి కంటి సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే చంద్రబాబు కంటి సమస్యకు చికిత్స అవసరమని వైద్యులు నివేదిక ఇచ్చారని టీడీపీ చెప్తోంది. అయితే జైలు అధికారులు ఆ నివేదికను దాచి పెట్టిందని ఆరోపిస్తోంది. చంద్రబాబును సెంట్రల్ జైలులో బుధవారం వైద్యులు పరీక్షించి నివేదిక ఇచ్చారు. ఆ నివేదికలో చంద్రబాబు నాయుడు కంటికి చికిత్స అవసరమని పేర్కొన్నారని టీడీపీ చెప్తోంది.అయితే జైలు అధికారులు విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో కంటి సమస్యను ప్రస్తావించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది.

జైలు సూపరింటెండెంట్ వివరణ ఇదే

చంద్రబాబుకు కంటికి చికిత్స అవసరమని వైద్యులు స్పష్టం చేశారని....ఆ నివేదికను మార్చి ఇవ్వాలని వైద్యులపై జైలు అధికారులు ఒత్తిడి తీసుకొస్తున్నారని టీడీపీ ఆరోపించింది. అయితే టీడీపీ ఆరోపణలపై జైలు సూపరింటెండెంట్ రాహుల్ వివరణ ఇచ్చారు. చంద్రబాబు మూడు నెలల క్రితం ఓ కంటికి ఆపరేషన్ చేయించుకున్నారని పేర్కొన్నారు. అయితే బుధవారం ఆయనను పరిశీలించిన ప్రభుత్వ వైద్యులు రెండో కంటికి వెంటనే ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదని చెప్పారని జైలు సూపరింటెండెంట్ రాహుల్ వివరించారు.

గతంలో ఆపరేషన్

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గతంలో కంటి సమస్యలతో బాధపడేవాడు. దాదాపు నాలుగు నెలల క్రితం చంద్రబాబు నాయుడు నాలుగు నెలల క్రితం ఎడమ కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకున్నారు. అయితే ఇప్పుడు కుడికంటికి కాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకోవాల్సి ఉంది. ఎడమ కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకున్న ఆరు నెలల వ్యవధిలోనే మరో కన్నుకు చేయించుకోవాలని టీడీపీ చెప్తోంది. ఇదిలా ఉంటే చంద్రబాబు నాయుడు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో కంటి సమస్యతో బాధపడుతున్నాడని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ వేశారు. చంద్రబాబు కంటికి శస్త్రచికిత్స చేయించాల్సి ఉందని ఈ నేపథ్యంలో అత్యవసరంగా బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపించాలని చంద్రబాబు తరఫు న్యాయవాది పిటిషన్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ హౌస్ మోషన్ పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు విచారణ జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed