- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంతమంది వైసీపీ ఇంచార్జిలను మార్చనున్నారా?
దిశ, ఏపీ బ్యూరో : ఎవరి సీటు గల్లంతవుతుందో తెలీదు.. ఎవరికి చెక్ పెడతారో అర్థం కావడం లేదు.. అంటూ వైసీపీ నేతల్లో దడ మొదలైంది. ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేతలు వీళ్లేనంటూ ఓ జాబితా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ లిస్టులోని మంత్రి విడదల రజనిని చిలకలూరిపేట నుంచి గుంటూరు పశ్చిమానికి మార్చారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌కు ఈ దఫా సీటు దక్కుతుందో లేదో తెలీదు. మలివిడత 24 నియోజకవర్గాల్లో మార్పులు ఉండొచ్చని పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. వెంటనే ప్రకటిస్తారా.. కొంత సమయం తీసుకుంటారా అనేది వైసీపీ శ్రేణుల్లో చర్చనీయాంశమైంది.
తొలివిడత 11 నియోజకవర్గాల్లో సమన్వయకర్తల మార్పుతో ఎమ్మెల్యే ఆర్కేతో పాటు గాజువాక ఇంచార్జి రాజీనామా చేశారు. రేపల్లెలో కొందరు స్థానిక నేతలు పదవులకు రాజీనామా చేస్తామంటూ హల్చల్ చేశారు. దీంతో సీఎం జగన్ ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితుల గురించి అందుబాటులో ఉన్న మంత్రులు, ఇతర ముఖ్యనేతలతో చర్చించారు. ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో మార్పులుంటాయని పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి ఈపాటికే సంకేతాలిచ్చారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం మార్పులు తప్పవని వెల్లడించారు.
సోషల్ మీడియాలో జాబితా..
మరోవైపు ప్రజా వ్యతిరేకతను తీవ్రంగా ఎదుర్కొంటున్న నేతలు వీళ్లేనంటూ 26 నియోజకవర్గాలకు సంబంధించిన జాబితా సోషల్ మీడియాలో వైరలవుతోంది. అందులో చిలకలూరిపేట, సంతనూతలపాడులో ఈ పాటికే మార్పులు చేశారు. మలివిడత 24 నియోజకవర్గాల్లో మార్పులు చేసే అవకాశమున్నట్లు పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. వీటిల్లో ఒకేసారి మారుస్తారా లేక రెండు దఫాలుగా చేపడతారా అనేది ఇంకా స్పష్టత లేదు. ఈ సారి ముందుగా ఆయా ఎమ్మెల్యేలు, ఇంచార్జులను బుజ్జగించి నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది.
వైసీపీ శ్రేణుల్లో అభద్రతాభావం..
నియోజకవర్గాల్లో నేతల మార్పు వల్ల కలిగే ప్రయోజనమెంత అనేది ఎన్నికల్లో తెలుస్తుంది. ఈ లోగా టికెట్ దక్కని నేతలు పార్టీ విజయానికి చిత్తశుద్ధితో పని చేస్తారా ! వేరే దారి చూసుకుంటారా ! పార్టీని దెబ్బతీస్తారా అనేది అధిష్టానాన్ని కలవరపెడుతోంది. టీడీపీ, జనసేనలో వాళ్లకు సీట్లు దక్కుతాయన్న నమ్మకం లేదు. అనివార్యంగా పార్టీ గెలుపు కోసమే పనిచేస్తారనే ధీమా కొంతమేర ఉంది. పార్టీ అధికారానికి వస్తే గౌరవప్రదమైన పదవి ఇస్తామని సీఎం జగన్ ఈ పాటికే ప్రకటించారు. అయినా పార్టీ శ్రేణుల్లో అభద్రతాభావం పెరుగుతోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.