- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అప్పుడొక తీరు.. ఇప్పుడో రకం.. ఎందుకిలా Cm Jagan!
- కోడి కత్తి కేసులో బాధితుడ్ని విచారించాల్సిందేనన్న ఎన్‌ఐఏ కోర్టు
- సీఎం జగన్హాజరవుతారా.. దీనికీ మినహాయింపు కోరతారా?
దిశ, ఏపీ బ్యూరో: సీఎం జగన్ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు విశాఖ ఎయిర్పోర్టులో ఆయనపై కోడి కత్తితో శ్రీను అనే యువకుడు దాడి చేశాడు. నిందితుడు అప్పటి నుంచి రిమాండులో ఉన్నాడు. కేసును విచారిస్తున్న ఎన్‌ఐఏ కోర్టు బెయిల్నిరాకరించింది. తాజాగా కేసు విచారణ సందర్భంగా బాధితుడ్ని విచారించకుండా మిగతా వాళ్లను విచారించి ప్రయోజనమేంటని ఎన్‌ఐఏ న్యాయస్థానం వ్యాఖ్యానించింది. బాధితుడు కచ్చితంగా కోర్టుకు హాజరు కావాల్సిందేనని ఆదేశించింది. మరి సీఎం జగన్కోర్టు ఆదేశాలను పాటిస్తారా? లేక వ్యక్తిగత హాజరును మినహాయించాలని కోరతారా?, అవసరమైతే సుప్రీం కోర్టు దాకా వెళ్తారా! అనేది చర్చనీయాంశమైంది.
వైఎస్జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పాదయాత్రను సైతం నిలిపేసి ఆయన కేసుల విచారణకు హాజరయ్యారు. ప్రతీ సోమవారం ప్రజా సంకల్పయాత్రకు విరామం ఇచ్చేది. వివేకా హత్య కేసు విషయంలోనూ జగన్తీరులో మార్పు కనిపిస్తోంది. నాడు సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. ఇప్పుడు నిందారోపణలు ఎదుర్కొంటున్న వాళ్లు సీబీఐ అధికారులపైనే కేసులు పెడుతున్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్‌ను హతమార్చిన కేసులో ప్రభుత్వం సక్రమంగా వ్యవహరించలేదనే అపవాదను ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో బాధిత కుటుంబానికి న్యాయం చేసే రీతిలో ప్రభుత్వ స్పందన లేదని గోదావరి జిల్లాల ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. చివరకు తన మిత్రుడు కేసీఆర్ఏలుబడిలో సోదరి షర్మిలను కారుతో సహా పోలీసులు లాక్కుపోయినా సీఎం జగన్ స్పందించలేదు.
ప్రతిపక్షనేతగా వైఎస్జగన్తనపై మోపిన కేసుల విచారణ సందర్భంగా ఠంచనుగా హాజరయ్యారు. ఒకసారి హైదరాబాద్హెలికాప్టర్లో వెళ్తే సుమారు రూ. 60 లక్షలు ఖర్చయ్యేది. సీఎం అయిన తర్వాత కొంత తీరిక లేకున్నా కనీసం ఒక్క కేసులోనూ నేరుగా హాజరైనట్లు లేదు. నాడు తనపై కేసుల విచారణలో కోర్టుకు హాజరై నిరపరాధిగా బయటకొస్తాననే విశ్వాసం వెలిబుచ్చేది. సీఎం జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు శ్రీను నాలుగేళ్ల నుంచి జైల్లో మగ్గుతున్నాడు. నిజంగా తనంతటతానే ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడా!, దీని వెనుక అప్పటి అధికార పక్షం టీడీపీ హస్తం ఉందా..? లేక ఇదంతా ఒక సానుభూతి కోసం వైసీపీ ఆడిన నాటకమా అనేది జనం నోళ్లలో నానుతోంది.
సహజంగా ఎవరైనా తనపై హత్యాయత్నానికి పూనుకున్న నిందితుడి పట్ల తీవ్రమైన ఆగ్రహం ఉంటుంది. అందులోనూ బాధితుడు ముఖ్యమంత్రి అయితే కొన్ని రోజుల వ్యవధిలోనే ముద్దాయికి తీవ్రమైన శిక్షలు పడేవి. అందుకు భిన్నంగా కోడి కత్తి కేసు నడుస్తోంది. రాజీవ్గాంధీ హత్య కేసులో నిందితులకు క్షమాభిక్ష పెట్టిన రాహుల్గాంధీ కుటుంబమంత ఉన్నతంగా సీఎం జగన్ఆలోచిస్తే.. కనీసం అదైనా న్యాయస్థానానికి వెల్లడించాల్సింది. ఇవేమీ చేయకుండా.. కోర్టుకు హాజరుకాకుండా ఎన్నాళ్లు నానుస్తారు. దీనివల్ల సీఎం జగన్అప్రదిష్టపాలయ్యే అవకాశముందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. సీఎం జగన్కేసుల విషయంలో అప్పటికీ, ఇప్పటికీ వచ్చిన మార్పు గురించి ప్రజలు చర్చించుకుంటున్నారు.
READ MORE