- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాళ్ల దాడిపై తొలిసారి స్పందించిన CM జగన్
దిశ, వెబ్‌డెస్క్: రాళ్ల దాడి ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తొలిసారి స్పందించారు. సోమవారం విజయవాడ సమీపంలోని కేసరపల్లి వద్ద తనను పరామర్శించేందుకు వచ్చిన నేతలతో మాట్లాడారు. తన బస్సు యాత్రకు వస్తోన్న ఆదరణ చూసి ఓర్వలేక దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. ప్రజల ఆశీర్వాదం ఉండటం వల్లే పెను ప్రమాదం తప్పిందని అన్నారు. ఎవరూ ఆందోళన చెందవద్దని.. మరోసారి కూడా మనమే అధికారంలోకి రాబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఈ తరహా దాడులు తనను ఆపలేవని అన్నారు. ధైర్యంగా ముందడుగు వేద్దాం అని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాగా, శనివారం జగన్‌పై రాళ్లతో దాడి జరిగింది. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా విజయవాడలో ప్రజలకు అభివాదం చేస్తుండగా.. గుర్తు తెలియని వ్యక్తులు జగన్‌పైకి రాళ్లు రువ్వారు. ఈ దాడిలో ఓ రాయి జగన్ ఎడమవైపు కనుబొమ్మకు తాకి రక్తస్రావం జరిగింది. దీంతో వెంటనే అప్రమత్తమైన వైద్యులు జగన్‌కు ఫస్ట్ ఎయిడ్ చేసి ఆసుపత్రికి తరలించారు. డిశ్చార్జి అయ్యి ఇవాళ మళ్లీ ప్రజల్లోకి వచ్చారు.