ప్రతిపక్షాలపై విరుచుకు పడిన సీఎం జగన్

by Mahesh |   ( Updated:2024-03-05 08:37:57.0  )
ప్రతిపక్షాలపై విరుచుకు పడిన సీఎం జగన్
X

దిశ, వెబ్‌డెస్క్: మంగళవారం విశాఖపట్టణంలో ఏర్పాటు చేసిన ఏపీ డెవలపమెంట్ సదస్సులో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత సీఎంగా మరోసారి ప్రమాణ స్వీకారం ఏపీ పాలనా రాజధాని అయిన విశాఖలోనే చేస్తానని.. తన ఇంటిని కూడా విశాఖకే మార్చుకుని ఇక్కడి నుంచే పాలన కొనసాగిస్తానని చెప్పుకొచ్చారు. తనకు రాష్ట్రంలో ఉన్న ఏ ప్రాంతంపై వ్యతిరేకత లేదని.. రాష్ట్రం మొత్తం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో అమరావతిని రాజధానిగా, విశాఖను పాలన, కర్నూలును న్యాయ రాజధానిగా ఏర్పాటు చేశామని చెప్పుకొచ్చారు.

అలాగే రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలపై సీఎం జగన్ ఫైర్ అయ్యారు. గతంలో స్వార్థంతో కూడిన రాజకీయ నాయకుల వలన విశాఖ తీవ్రంగా వెనుకబడిపోయింది సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు తమ స్వార్థం కోసం సిగ్గులేకుండా విశాఖపై తప్పుడు ప్రచారం చేశారని ఫైర్ అయ్యారు. కోర్టుకు వెళ్లి విశాఖ, రాష్ట్రాభివృద్ధిని అడ్డుకున్నారు. అలాంటి వారికి విశాఖ పై ఎటువంటి ఆసక్తి లేదని.. వేరే ప్రాంతంలో ఎక్కడో ఉందని.. వారంతా రాజధాని ఏర్పాటు కాకముందు అక్కడ వేల ఎకరాలు కొన్నారని.. విశాఖ రాజధాని అయితే వారు కొన్న భూముల ధరలు పడిపోతాయనే భయం పట్టుకుందని.. పరోక్షంగా టీడీపీ నాయకులను ఉద్దేశించి తీవ్ర స్థాయిలో సీఎం జగన్ మండిపడ్డారు.

Read More..

ఏపీ రాజధానిగా విశాఖ.. తేల్చి చెప్పిన సీఎం జగన్

Advertisement

Next Story

Most Viewed