- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
CM Chandrababu: డ్రోన్స్.. ఫ్యూచర్ గేమ్ ఛేంజర్స్: సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: డ్రోన్స్.. ఫ్యూచర్ గేమ్ ఛేంజర్స్ అని సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మంగళగిరి (Mangalagiri)లోని సీకే కన్వెన్షన్ (CK Convention)లో రెండు రోజుల పాటు నిర్వహించే డ్రోన్ సమ్మిట్ (Drone Summit)ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఇలాంటి కార్యక్రమానికి రూపకల్పన చేయడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. డ్రోన్స్.. ముమ్మాటికీ ఫ్యూచర్ గేమ్ ఛేంజర్స్ అని పేర్కొన్నారు. 1995లోనే తాను ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ గురించి ఆలోచించానని తెలిపారు. ఆ క్రమంలోనే మైక్రోసాఫ్ట్ (Microsoft) లాంటి పెద్ద కంపెనీలను రాష్ట్రానికి తీసుకొచ్చానని గుర్తు చేశారు.
మొదటిసారిగా పీపీపీ (PPP) విధానంలో హైటెక్ సిటీ (Hitech City)ని నిర్మించామని అన్నారు. అక్కడ ఐటీ అభివృద్ధికి కృషి చేశానని అన్నారు. నేడు దేశంలోనే హైదరాబాద్ (Hyderabad).. గొప్ప నగరంగా తయారైందని పేర్కొన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ (Andhra PradesH)ను డ్రోన్ హబ్ (Ddone Hub)గా మార్చడమే తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారు. విజయవాడ (Vijayawada) వరదల్లో డ్రోన్ల సేవలు ఎంతో విలువైనవని అన్నారు. రెస్క్యూ టీమ్స్ కూడా చేరుకోలేని చోటుకు డ్రోన్లను పంపిం ప్రజలకు ఆహారం, నీళ్లు, మందులు అందజేశామని గుర్తు చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో డ్రోన్స్ ఎంతగానో దోహదపడుతాయని, ఎవరైనా తప్పు చేస్తే లైవ్ విజువల్స్ (Live Visuals)తో నిమిషాల్లో పట్టుకుని శిక్షిస్తామని సీఎం చంద్రబాబు (CM Chandrababu) వార్నింగ్ ఇచ్చారు.
ఇక నుంచి డ్రోన్ పైలట్ ప్రాజెక్టులకు ఏపీ వేదిక అవుతుందని పేర్కొన్నారు. మరో 15 రోజుల్లోనే డ్రోన్ పాలసీని తీసుకొస్తామని అన్నారు. డ్రోన్ సర్టిఫికేట్ ఏజెన్సీని కూడా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా ఓర్వకల్లులో 300 ఎకరాల భూమిని కూడా కేటాయిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. డ్రోన్ కంపెనీలకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందని.. థింగ్ గ్లోబల్లీ.. యాక్ట్ గ్లోబల్లీ తమ ప్రభుత్వం విధానమని సీఎం చంద్రబాబు అన్నారు.