‘వైసీపీ నేతల భార్యలపై పోస్టులు పెట్టినా వదలను’.. సీఎం చంద్రబాబు వార్నింగ్

by Jakkula Mamatha |
‘వైసీపీ నేతల భార్యలపై పోస్టులు పెట్టినా వదలను’.. సీఎం చంద్రబాబు వార్నింగ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మరోసారి హెచ్చరిస్తున్న.. ఆడబిడ్డల జోలికొస్తే జాగ్రత్త అని సీఎం చంద్రబాబు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. శ్రీశైలంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తీవ్రవాదులతో పోరాడిన పార్టీ టీడీపీ అని గుర్తు చేశారు. ముఠా నాయకులను పూర్తిగా కంట్రోల్ చేశామని అన్నారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే వారిని నియంత్రణ చేశామని తెలిపారు. రౌడీలను లేకుండా చేశామన్నారు. ఇప్పుడు రౌడీలు నేరస్తులు రాజకీయ ముసుగు వేసుకున్నారని తెలిపారు. మీ ముసుగు తీస్తానన్నారు. రాజకీయ నాయకులు రాజకీయ నాయకులుగానే నేరస్తులు నేరస్తులు గానే చూస్తానన్నారు. ఇందులో రాజీ పడేది లేదన్నారు.

ఒకరిద్దరు పోలీస్ ఆఫీసర్లు ఎక్కడున్నా తప్పు చేసిన లేదా లాలూచీపడిన వారికి అదే చివరి రోజు అన్నారు. లా అండ్ ఆర్డర్ మైంటైన్ చేస్తేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయన్నారు. శాంతమైన వాతావరణం ఉంటేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని అన్నారు. మీకు మీ కుటుంబ సభ్యుల పైన గౌరవం లేకపోవచ్చు కానీ మాకు మాత్రం గౌరవం ఉందన్నారు. ఆడబిడ్డ పైన పోస్టులు పెట్టిన.. అది కూడా వైసీపీ నాయకుల భార్య, బిడ్డలపై పోస్టింగులు పెట్టిన వదిలిపెట్టి బోనని హెచ్చరించారు. మనుషులుగా ఉంటే మనుషులు గానే చూస్తామన్నారు. ఇది ప్రజాస్వామ్యం రాతీ కాదన్నారు. తమ కూతుర్లు బోరును ఏడ్చారని డిప్యూటీ సీఎం అన్నారని గుర్తు చేశారు.

Advertisement

Next Story

Most Viewed