CM Chandrababu: అధికారులు సరిగా పని చేయకపోతే సహించేది లేదు: సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్

by Shiva |   ( Updated:2024-09-03 15:25:57.0  )
CM Chandrababu: అధికారులు సరిగా పని చేయకపోతే సహించేది లేదు: సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: విపత్కర పరిస్థితుల్లో అధికారులు కష్టపడి పనిచేయాలని.. ఎవరైనా విధుల పట్ల నిర్లక్ష్య వహిస్తే సహించేది లేదని సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇవాళ ఆయన ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో మాట్లాడుతూ.. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎవరూ ఆకలితో అలమటించే పరిస్థితి ఉండొద్దని సీఎం సూచించారు. ప్రతి ఒక్కరికీ ఆహారం అందించాలని అధికారులను ఆదేశించారు. సరిగ్గా పని చేయలేదనే కారణంతో ఇవాళే జక్కంపూడిలో ఓ అధికారిని కూడా సస్పెండ్చ చేశారని పేర్కొన్నారు. గత ఐదేళ్లుగా అధికార యంత్రంగం సరిగా పని చేయడం లేదని ఆరోపించారు.

విజయవాడలో వరద బాధితుల పరిస్థితి దైన్యంగా ఉందని పేర్కొన్నారు. కొన్ని ఇళ్లలో పాములు, తేళ్లు వస్తున్నాయని.. వారికి సరైన ఆహారం అందడం లేదని కంప్లయింట్లు వస్తున్నాయని పేర్కొన్నారు. అదేవిధంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో సాధ్యమైన అన్ని ఎక్కుడ డ్రోన్లు తీసుకొచ్చి ఆహారన్ని పంపిణీ చేస్తామని అన్నారు. ప్రస్తుతం ఫీల్డ్‌లో 32 మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారని పేర్కొన్నారు. ప్రజల ఇబ్బందులు తొలగించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నామని అన్నారు. చివరి బాధితుడికి కూడా సాయం అందేలా చూస్తున్నామని తెలిపారు. అధికారులు అప్రమత్తంగా ఉండాల్సిందేనని.. ప్రభుత్వ ఆదేశలు పాటించన పక్షంలో వారిపై చర్యలు తప్పవని సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.

Advertisement

Next Story