- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరోసారి ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ఈ సారి ఎందుకంటే..?
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ చీఫ్, ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. ఇవాళ్టి వరకు అసెంబ్లీ సమావేశాల్లో బిజీబిజీగా గడిపిన బాబు.. అసెంబ్లీ సెషన్ నిరవధిక వాయిదా పడటంతో వెంటనే హస్తిన బాటపట్టారు. రేపు (శనివారం) ప్రధాని మోడీ అధ్యక్షతన జరగనున్న నీతి ఆయోగ్ కౌన్సిల్ మీటింగ్‌కు హాజరయ్యేందుకు ఆయన ఢిల్లీకి వెళ్తున్నారు. కీలకమైన ఈ నీతి ఆయోగ్ కౌన్సిల్ భేటీలో డిజిటల్ కరెన్సీ ప్రాముఖ్యతను చంద్రబాబు వివరించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉంటే, 2024-2025 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు నిరసనగా నీతి ఆయోగ్ కౌన్సిల్ సమావేశాలను కాంగ్రెస్ పాలిత రాష్ట్ర సీఎంలు బహిష్కరించిన విషయం తెలిసిందే.
కేంద్ర బడ్జెట్‌లో ఎన్డీఏ తమ మిత్ర పక్షాలైన టీడీపీ, జేడీయూ అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకే భారీగా నిధులు కేటాయించి మిగిలిన రాష్ట్రాలపై వివక్ష చూపించిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ నీతి ఆయోగ్ కౌన్సిల్ భేటీని బహిష్కరించింది. కాంగ్రెస్‌తో పాటు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సైతం ఈ సమావేశానికి హాజరు కాబోమని ప్రకటించారు. ప్రధాని మోడీ చైర్మన్‌గా ఉండే నీతి ఆయోగ్‌కు అన్ని రాష్ట్ర సీఎంలకు ఆహ్వానం ఉంటుంది. ఈ నేపథ్యంలో నీతి ఆయోగ్ సమావేశాలకు హాజరుకామని కాంగ్రెస్ పాలిత రాష్ట్ర సీఎంలు నిర్ణయం తీసుకున్నారు.