- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Breaking: జోరు వానలోనూ సీఎం చంద్రబాబు కీలక ప్రసంగం
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో 97 శాతం పింఛన్లు పంపిణీ చేశామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. అనంతపురం జిల్లా మడకశిర మండలం గుండుమలలో లబ్ధిదారులకు ఆయన స్వయంగా పింఛన్ డబ్బులు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రజా వేదిక కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. జోరు వానలోనే ఆయన మాట్లాడుతూ పింఛన్ పథకాన్ని ఎన్టీఆర్ ప్రారంభించారని, ఆ సమయంలో లబ్ధిదారులకు రూ. 35 అందజేశారని గుర్తుచేశారు. ప్రస్తుతం రూ. 4 వేలు అందజేస్తున్నామన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పింఛన్ పంపిణీ చేస్తున్నామని చెప్పారు. తమది పేదల ప్రభుత్వమని, ఎప్పుడూ అండగా ఉంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో జవాబుదారీ పాలన సాగుతోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గత ఐదేళ్లు వైసీపీ విధ్వంసాలకు పాల్పడిందని, అందుకే జగన్ పార్టీకి 11 సీట్లు వచ్చాయని ఎద్దేవా చేశారు. జగన్ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించిందని మండిపడ్డారు. ప్రజల ఆస్తులను వైసీపీ నాయకులు ఇష్టానుసారం దోచుకున్నారని ధ్వజమెత్తారు. రూ. 700 కోట్లు ఖర్చు చేసి సర్వే రాళ్లపై జగన్ ఫోటోలు వేయించుకున్నారని విమర్శించారు. పేదలకు ఇళ్లు కట్టకుండా, విశాఖ రుషికొండలో జగన్ ప్యాలెస్ కట్టుకున్నారని ఎద్దేవా చేశారు. వాస్తవాలు బయటకు తెలిసేలా 7 శ్వేత్ర పత్రాలు విడుదల చేశామన్నారు. మడకశిరకు కాలువ ద్వారా నీళ్లిచ్చిన ఘనత తమదేనన్నారు. తాము పాలకులం కాదని, సేవలకులమని చెప్పారు. అనంతపురం జిల్లాను సస్యశ్యామలం చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.