CM Chandrababu: అమరావతిని ఎడారిగా మార్చేశారు.. సీఎం చంద్రబాబు ఫైర్

by Shiva |   ( Updated:2024-11-07 09:21:20.0  )
CM Chandrababu: అమరావతిని ఎడారిగా మార్చేశారు.. సీఎం చంద్రబాబు ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐదేళ్ల వైసీపీ (YCP) పాలనలో ప్రజా రాజధాని అమరావతి (Amaravati)ని ఎడారిగా మార్చేశారని సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఫైర్ అయ్యారు. ఇవాళ అమరావతి (Amaravati)లోని తాళ్లాయపాలెం (Thallayapalem)లో జీఐఎస్ సబ్ స్టేషన్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు (CM Chandrababu) మాట్లాడుతూ.. అమరావతి (Amaravati)లో విద్యుత్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇప్పుడు మొదలు పెట్టిన సబ్ స్టేషన్లు అన్ని ఏడాదిలోపు పూర్తి చేస్తామని పేర్కొ్న్నారు. గతంలో కరెంట్ కోతల మీద పెద్ద చర్చే జరిగేదని.. తాను విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు చాలామంది వ్యతిరేకించారని తెలిపారు. కొరత లేకుండా చేయడమే కాకుండా మిగులు కరెంట్‌ను కూడా తీసుకొచ్చామని అన్నారు.

2014 మళ్లీ తాను సీఎం అయ్యే సరికి 22.5 మిలియన్ యూనిట్ల కొరత ఉందన్నారు. ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసీపీ సర్కార్ (YCP Government) పోలవరం (Polavaram) డయాఫ్రబ్ వాల్ నాశనం చేశారని ఆరోపించారు. అమరావతి (Amaravati)ని ఎడారిగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారని ఫైర్ అయ్యారు. అమరావతిని కాపాడిన ఘనత ఆడబిడ్డలకే దక్కుతుందని అన్నారు. దుర్మార్గం, అహంకారంతో ముందుకు పోతే ఇలాంటి విధ్వంసాలే జరుగుతాయని.. ప్రజలు వైసీపీకి సరైన బుద్ధి చెప్పారని కామెంట్ చేశారు. రాష్ట్ర రాజధానిని నెంబర్‌వన్ సిటీగా తయారు చేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని సీఎం చంద్రబాబు అన్నారు.


Read More..

AP Govt.: విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. మరో కొత్త పథకానికి శ్రీకారం

Advertisement

Next Story