Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్

by srinivas |
Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్
X

దిశ, తిరుమల: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. స్వామివారి ఆన్ లైన్‌లో దర్శన, వసతి గదులు కోటా విడుదలకు సంబంధించిన క్యాలండర్‌ను ప్రకటించింది. స్వామివారి దర్శనం కోసం వెళ్లే శ్రీవారి భక్తుల సౌకర్యార్ధం విడుదల చేసే అన్ని రకాల టికెట్లకు సంబంధించిన తేదీలతో సహా క్యాలెండర్‌ను టీటీడీ విడుదల చేసింది. ఈ క్యాలెండర్ వెంకన్న భక్తులకు ఉపయోగకరంగా ఉండనుంది.

తిరుమల ఆన్ లైన్‌లో దర్శన, వసతి గదులు కోటా విడుదలకు సంబంధించిన క్యాలండర్ విడుదల చేసింది టీటీడీ. ఇక నుంచి ప్రతి నెల 18వ తేది నుంచి 20 వ తేది వరకు లక్కిడిప్ విధానంలో ఆర్జిత సేవా టికెట్లు విడుదల చేయనున్నారు. 21వ తేదిన వర్చువల్ సేవా టికెట్లతో పాటు నేరుగా బుక్ చేసుకునే సేవా టికెట్లు విడుదల చేస్తారు. 23వ తేదిన శ్రీవాణి, అంగప్రదక్షణం, వయో వృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లు విడుదల చేయనున్నారు. 24వ తేదిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల చేస్తారు. ఇక 25వ తేదీన వసతి గదులు కోటాను టీటీడీ విడుదల చేయనున్నారు.

Advertisement

Next Story